e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి

World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి

ప్రపంచంలోనే ఎత్తైన అమెరికాకు చెందిన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (World Trade Center) జంట భవనాలపై ఉగ్రవాదులు అమానుషంగా దాడికి దిగిన సంఘటన 2001 లో సరిగ్గా ఇదే రోజున జరిగింది. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా పరిగణించబడుతున్నది. ఈ దాడిలో 93 దేశాలకు చెందిన దాదాపు 3000 మంది దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్‌, లెబనాన్‌కు చెందిన 19 మంది ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్‌ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ తెలిపింది.

ఎప్పటిలాగే అమెరికాలో ప్రజలు తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట టవర్లలో కూడా దాదాపు 18,000 వేల మంది వారివారి విధుల్లో ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల కార్యాలయాలు ఈ జంట టవర్లలో ఉన్నాయి. సరిగ్గా ఉదయం 8.45 నిమిషాలకు ఒక్కసారిగా ఉత్తరం దిశలోని టవర్‌లోకి బోయింగ్‌ 767 విమానం పెద్దగా శబ్ధం చేస్తూ చొచ్చుకున వచ్చి పేలిపోయింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు, దుమ్ము ధూళి ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఎంత మంది చనిపోయారో తెలియదు. గాయాలకు గురైన వారి హాహాకారాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో మరో విమానం రెండో టవర్‌ను బలంగా ఢీకొని పేలిపోయింది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకు మరో రెండు విమానాల్లో ఒకటి పెంటగాన్‌పై కుప్పకూలగా.. ఇంకొకటి షాంక్‌విల్లే ఫాంలో కుప్పకూలిపోయింది. ఒక్క పెంటగాన్‌ ఘటనలోనే 184 మంది చనిపోయినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

ఈ విమానాల దాడులకు ప్రధాన సూత్రధారిగా అల్‌ ఖాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అని అమెరికా వెల్లడించింది. ఈ విమానాల దాడుల అనంతరం లాడెన్‌ ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా లాడెన్‌ నిలిచారు. బిన్ లాడెన్‌ను సజీవంగా లేదా చంపి తీసుకురావడానికి అమెరికా 25 మిలియన్ డాలర్ల బహుమతిని అందించింది. తుదకు 2011 మే 2 న పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ఓ ఇంట్లో దాక్కున్న బిన్ లాడెన్‌ను రహస్య మిషన్‌లో అమెరికా చంపేసింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2007: జెరూసలేం ప్రక్కనే ఉన్న డేవిడ్ నగరంలో దాదాపు 2000 సంవత్సరాల నాటి పురాతన సొరంగం గుర్తింపు

2006: యూఎస్‌ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలుచుకున్న పేస్‌-డేమ్‌ జోడి

2005: గాజా స్ట్రిప్‌లో 38 సంవత్సరాల సైనిక పాలన ముగిసినట్లు ప్రకటన

2003: చైనా నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ దలైలామాను కలిసిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్

1971: ఈజిప్టులో రాజ్యాంగం ఆమోదం

1968: నైస్‌ సమీపంలో కుప్పకూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం, 95 మంది దుర్మరణం

1965: ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్ సమీపంలోని బుర్కి నగరాన్ని స్వాధీనం చేసుకున్న భారత సైన్యం

1961: వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఏర్పాటు

1951: ఇంగ్లిష్ ఛానల్‌లో ఈత కొట్టిన మొదటి మహిళగా ఫ్లోరెన్స్ చాడ్విక్ రికార్డు

1941: రక్షణ శాఖ ఆధ్వర్యంలో పెంటగాన్ నిర్మాణం ప్రారంభం

1939: జర్మనీపై యుద్ధం ప్రకటించిన ఇరాక్, సౌదీ అరేబియా

1906 : దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహాన్ని ప్రారంభించిన కరమ్‌చంద్‌ గాంధీ

1893 : చికాగోలో ప్రపంచ మతాల సమావేశంలో ప్రసంగం చేసిన వివేకానందుడు

ఇవి కూడా చ‌ద‌వండి..

బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?

జపాన్‌ యువతలో బుస కొడుతున్న హికికొమోరి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement