
వెల్లింగ్టన్, సెప్టెంబర్ 3: న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు ఆకర్షితుడైన ఓ వ్యక్తి ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం అక్లాండ్‌లోని ఓ సూపర్ మార్కెట్లో చోటుచేసుకుంది. నిందితుడి కదలికలపై మొదటి నుంచి అనుమానం ఉన్న పోలీసులు అతడిపై ఓ కన్నేసి ఉంచారు. శుక్రవారం సూపర్‌మార్కెట్‌కు వెళ్తున్న అతడిపై నిఘా పెట్టారు. సూపర్మార్కెట్లోనికి ప్రవేశించిన అతడు కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని నిలువరించడానికి ప్రయత్నించారు. అప్పటికే అతడు ఆరుగురిని పొడిచాడు. పోలీసులు అతడిని తుపాకీతో కాల్చివేశారు.