క్యూబాను చుట్టుముడుతున్న అమెరికా!
మెరికా, క్యూబా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బహుళ మార్గాల నుంచి క్యూబాపై అమెరికా ఒత్తిడి పెంచుతున్నది. ఇంధన అడ్డంకులు ఇప్పటికే అమలులో ఉండగా యుద్ధ నౌకలు, నిఘా విమానాలు, ఇతర సైనిక బలగాల మోహరింపును కరీబియన్‌లో అమెరికా ముమ్మరం చేసింది.
- భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్ల మోహరింపు
న్యూఢిల్లీ, మే 29: అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బహుళ మార్గాల నుంచి క్యూబాపై అమెరికా ఒత్తిడి పెంచుతున్నది. ఇంధన అడ్డంకులు ఇప్పటికే అమలులో ఉండగా యుద్ధ నౌకలు, నిఘా విమానాలు, ఇతర సైనిక బలగాల మోహరింపును కరీబియన్‌లో అమెరికా ముమ్మరం చేసింది. ఈ నెల 20న యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ రాకతో ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది.
క్యూబా తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటున్నది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు, ప్రజా రవాణాకు అంతరాయం, పారిశ్రామిక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఒత్తిడిలో ఉన్న క్యూబా ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత భారాన్ని మోపింది. రష్యా, చైనాలతో క్యూబాకు ఉన్న సంబంధాల కారణంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల దానిని జాతీయ భద్రతా ముప్పుగా వర్ణించారు.
మరోపక్క యుద్ధం రక్తపాతానికి దారితీస్తుందని, వేలాది క్యూబన్లు, అమెరికన్లు మరణిస్తారని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్ హెచ్చరించారు. 1959లొ జరిగిన క్యూబన్ విప్లవం తర్వాత అమెరికా, క్యూబాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

