టెక్సాస్, మార్చి 25 : అమెరికాలో తెలుగు యువకుడొకరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిన ఒక రోజు తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై కన్పించాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్. భార్యతో ప్రిన్స్టన్లో నివసిస్తున్నాడు. అయితే శనివారం ఆయన అదృశ్యం కాగా, మరునాడు ఆయ న మృతదేహం టెక్సాస్‌లో దొరికింది. అభిషేక్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అభిషేక్ గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆయన సోదరుడు తెలిపాడు. దీం తో అతని మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి గోఫండ్ మీ క్యాంపెయిన్ ద్వారా నిధులు సేకరించారు.