Teen Dies : స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన 14 ఏండ్ల బాలిక ఉదంతం కలకలం రేపింది. అమెరికాలోని ఇల్లినాయిస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమరి క్రైట్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.
ఆటలో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివరికి వెళ్లిన బాలిక ఆపై కుప్పకూలింది. క్రైట్ మరణంపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. తొమ్మిదో తరగతి చదివే బాలిక హఠాన్మరణంతో స్కూల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాలిక మరణం పట్ల ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని స్కూల్ సూపరింటెండెంట్ షనాన్ అండర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ క్రీడల్లో పాల్గొంటూ పలువురు చిన్నారులు, యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Read More :
Counselling | కొత్త జంటలకు కౌన్సెలింగ్.. ఎందుకో తెలుసా?