లండన్: బ్రిటన్‌లోని సౌత్ వేల్స్, పోర్ట్ టాల్బోట్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేయాలని టాటా స్టీల్ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. రానున్న 18 నెలల్లో 2,500 మందిని తొలగిస్తామని, మిగిలిన వారిని రానున్న మూడేళ్లలో తొలగిస్తామని ఆ సంస్థ తెలిపింది. దీని కోసం అవసరమైన చట్టపరమైన సంప్రదింపులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. స్వచ్ఛందంగా వైదొలగడాన్ని ప్రోత్సహిస్తామని, బాధిత ఉద్యోగులకు సపోర్ట్ ప్యాకేజ్ కోసం 130 మిలియన్ పౌండ్లను ఖర్చు చేస్తామని తెలిపింది.