Haiti | మిరాగోనే (హైతీ), సెప్టెంబర్ 15: ట్యాంకర్ ట్రక్కు నుంచి లీకవుతున్న ఆయిల్‌ను పట్టుకోవడానికి కొందరు పౌరులు ఎగబడ్డారు. అయితే అదే సమయంలో ఆ ట్యాంకర్‌కు నిప్పంటుకుని పేలుడు సంభవించింది. హైతీ దేశంలోని మిరాగోనే పట్టణంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 25 మంది మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిని హైతియన్ ప్రధాని గ్యారీ కొనిల్లే సందర్శించారు. ప్రమాదస్థలి చాలా భయానకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా దగ్గరలోని దవాఖానలకు తరలించామని, అత్యవసర బృందాలు ప్రమాద స్థలిలో పనిచేస్తున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు.