ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల ( Taliban ) వంటి రాక్షస మూకల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రపంచమంతా ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దీనిని బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించడం గమనార్హం. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్‌ను ఓ మీడియంగా తీసుకోవడంపై ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకొని పూర్తిగా దానికి విధేయులుగా మారుతున్నారు.
అదే జరిగితే అది బానిసత్వం కంటే కూడా దారుణం. సాంస్కృతికి బానిసత్వాన్ని వదులుకోవడం అంత సులువు కాదు. ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వాళ్లు బానిసత్వపు సంకెళ్లను తెంచారు అని ఇమ్రాన్ అనడం గమనార్హం. ఆదివారం రాజధాని కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌ను రాజ్యమేలడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.