Taiwan | తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్‌కు గట్టి షాక్ తగిలింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) అభ్యర్థి లాయి చింగ్ తే విజయం సాధించారు. యుద్ధం, శాంతి మధ్య ఏది కావాలో ఎంచుకోవాలని తైవాన్ ఓటర్లకు చైనా సూచించింది. లాయి చింగ్ తేకు ఓటేయొద్దని, ఆయన్ను తిరస్కరించాలని చైనా జారీ చేసిన హెచ్చరికలు తైవాన్ పౌరులు తోసిపుచ్చారు. దీంతో మరోమారు డీపీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. తైవాన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తొలి నుంచి వేర్పాటువాద ఐడెంటిటీని కలిగి ఉండటంతోపాటు తైవాన్ తమ భూభాగం తమదేనని చైనా వాదనను తోసిపుచ్చుతున్నది.
ప్రస్తుతం డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఉపాధ్యక్షుడిగా ఉన్న లాయి చింగ్‌తే అసాధారణ రీతిలో మూడోసారి విజయం సాధించారు. లాయి చింగ్ తేకు వ్యతిరేకంగా తైవాంగ్లోనే అతిపెద్ద విపక్ష పార్టీ కొమింటాంగ్ (కేఎంటీ) పార్టీ తరఫున హౌ యూఐ, తైపై పీపుల్స్ పార్టీ కి చెందిన కో వెన్ జీ ఓటమి పాలయ్యారు. లాయి చింగ్తేను ప్రమాదకర వేర్పాటువాదిగా చైనా ప్రకటించింది. తైవాన్ కోసం స్వతంత్య్రం కోసం ప్రయత్నిస్తే యుద్ధం తప్పదని హెచ్చరించింది. లాయి చింగ్‌తే చర్చల ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే తాను శాంతినే కోరుకుంటున్నానని, అదే సమయంలో ద్వీపకల్పం చుట్టూ రక్షణ బలగాలను మోహరిస్తామని చెప్పారు.