వాషింగ్టన్, నవంబర్ 9: సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన ఇప్పుడు అధ్యక్షుడి హోదాలో అమెరికాలో పర్యటిస్తున్నారు.
1946లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వాషింగ్టన్‌ను సందర్శించిన మొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు.