Sunita Williams | వాషింగ్టన్, మార్చి 10: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ ఈ నెల 16న భూమికి తిరిగి రానున్నారు. గత తొమ్మిది నెలలుగా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయారు. సాంకేతిక కారణాల వల్ల వాళ్లు తిరుగు ప్రయాణం కావాల్సిన వ్యోమనౌక ఆలస్యం కావడంతో వారిద్దరూ భూమిపైకి రావడం మరింత ఆలస్యమైంది.
స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా వారిద్దరిని భూమికి తిరిగి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని నాసా అధికారులు ధ్రువీకరించారు. స్టార్‌లైనర్ వ్యోమ నౌకను పరీక్షించడం కోసం విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు.