Mothers | సిడ్నీ, ఆగస్టు 13: ఆరు నెలలు అంతకు మించి తమ పిల్లలకు పాలిచ్చే తల్లుల గుండె మూడేండ్ల పాటు పదిలంగా ఉంటుందని సిడ్నీ పరిశోధకులు వెల్లడించారు. రక్తపోటు, మధుమేహం కూడా అదుపులోనే ఉంటాయని వారు తెలిపారు. సిడ్నీలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లెయిర్ రాబర్ట్ తన బృందంతో ఈ అంశంపై పరిశోధనలు చేశారు.
సాధారణంగా గర్భం సమయంలో సంక్లిష్టత ఎదురైన మహిళలు ఆ తర్వాత హృదయ సంబంధిత రోగాల బారినపడుతుంటారు. అయితే రాబర్ట్ బృందం చేసిన పరిశోధనలు ఇటువంటి వారికి కొంతమేరకు ఉపశమనం కలిగించనున్నది.