న్యూయార్క్, జూన్ 15: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. యూఎస్‌లోని స్టార్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో సుందర్ పిచాయ్ మాట్లాడుతుండగా పలువురు విద్యార్థులు వాకౌట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్‌కు ఉన్న ఒప్పందం కారణంగా పాలస్తీనాకు మద్దతుగా వాళ్లు వేదిక వద్ద నుంచి వెళ్లిపోయారు. ఈ వాకౌట్ చేసిన వారిలో జస్టిస్ ఫర్ పాలస్తీనా, నో టెక్ ఫర్ అపార్టెడ్ లాంటి స్టూడెంట్ గ్రూపులున్నాయి.
గూగుల్‌తో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌కు, యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ లాంటి వాటితో లింకులు ఉండటాన్ని ఈ నిరసన చూపిస్తున్నదని బ్రేక్ త్రూ న్యూస్ ఏజెన్సీ రాసుకొచ్చింది. సుందర్ పిచాయ్ తన స్పీచ్‌లో ఎక్కడా కూడా ఏఐ, టెక్నాలజీ గురించి డీప్‌గా చర్చించ లేదు. కేవలం స్టూడెంట్ల వ్యక్తిగత కెరీర్, సక్సెస్ గురించి మాత్రమే మాట్లాడారు.