టోక్యో: భారీ భూకంపం ఒకటి గురువారం జపాన్ను వణికించింది. దక్షిణ తీర ప్రాంతంలోని క్యుషు తీరంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. భూమికి 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. భూ ప్రకంపనలతో క్యుషు ద్వీపంలోని నిచినాన్ నగరం, మియాజకి ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి. దీని ప్రభావంతో తీరంలో అలలు 1.6 అడుగుల మేర ఎగసిపడ్డాయి. అయితే ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు.