Paralysis | టోక్యో: పక్షవాతానికి స్టెమ్ సెల్ చికిత్సతో ప్రయోజనాలు కనిపించాయి. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న నలుగురిలో ఇద్దరికి కొంత ఉపశమనం దొరికింది. వెన్నెముక గాయానికి చికిత్సలో భాగంగా వారికి న్యూరల్ స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్ చేశారు. నడవలేని స్థితిలో అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక రోగి లేచి, నిల్చోగలిగారు. నడవడానికి ఆయనకు శిక్షణ ఇస్తున్నారు.
మరో వ్యక్తి ఈ చికిత్సతో చేతులు, కాళ్లు కదపగలుగుతున్నారు. జపాన్‌లోని కీయో యూనివర్సిటీ స్టెమ్ సెల్ శాస్త్రవేత్త హిడెయుకి, ఇతర శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ చికిత్స సురక్షితమైనదని చెప్పారు. స్టెమ్ సెల్స్ అంటే శరీరంలోని ప్రత్యేకమైన సెల్స్. ఇవి చర్మం, కండరాలు లేదా బ్లడ్ సెల్స్ వంటి వేర్వేరు రకాల సెల్స్‌గా మారుతాయి.