బీజింగ్: యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా మొదటి అనుబంధ దవాఖాన శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధికి మూల కణ చికిత్సను (స్టెమ్ సెల్ థెరపీ) కనిపెట్టారు. ఈ చికిత్స విధానంలో 80 శాతం కంటే ఎక్కువ మూల కణాలను పార్కిన్సన్స్లో కోల్పోయిన మెదడు కణాలుగా మారుస్తారు. ఇది సాధారణ ప్రమాణ స్థాయి కంటే ఎక్కువ. గల్లంతైన వాటి స్థానంలో ‘సీడ్’ సెల్స్‌ను మెదడులో భర్తీ చేయడమే క్లుప్తంగా ఈ ఆలోచన ముఖ్య సూత్రం. ఈ ఏడాది మొదట్లో ఈ చికిత్స విధానాన్ని పరీక్షించినప్పుడు డొపమైన్ సిగ్నలింగ్ మెరుగుపడి ఆశాజనక ఫలితాలు వచ్చాయి. 37 ఏండ్ల వ్యక్తికి మూడు నెలల్లో దాదాపుగా సాధారణ శారీరక కదలికలు వచ్చాయి.