జాఫ్నా, జనవరి 28 : శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అడుగుపెట్టారన్న ఆరోపణతో 13 మందితో ఉన్న భారత మత్స్యకార నౌకపై డెల్ఫ్ ద్వీపంలో మంగళవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులు గాయపడ్డారు. ఈ చర్యపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని శ్రీలంక హైకమిషనర్‌ను పిలిచి నిరసన తెలియజేసింది. మత్స్యకారులపై కాల్పులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. క్షతగాత్రులను జాఫ్నాలోని భారత దౌత్య అధికారులు పరామర్శించారు. వారికి కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని హామీనిచ్చారు.