ఆస్టిన్: టెక్సాస్‌లో బుధవారం రాత్రి స్పేస్ఎక్స్ పరీక్షిస్తున్న రాకెట్ ఒకటి ఆకాశంలో పేలిపోయింది. స్టార్ బేస్‌లో తమ స్టార్ షిప్ పదో ఫ్లైట్ టెస్ట్ స్టాండ్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు రాత్రి 11 గంటల సమయంలో ‘ఒక అసాధారణ పరిస్థితిని’ ఎదుర్కొన్నామని స్పేస్ ఎక్స్ ప్రమాదం గురించి తెలిపింది.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తెలిపారు. ప్రయోగ ప్రాంతంలో, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టామని ఎక్స్‌లో ఆ సంస్థ ట్వీట్ చేసింది.