Elon Musk: హాట్‌కేకుల్లా స్పేస్ఎక్స్ ఐపీవో సేల్.. ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్
Elon Musk: ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. ఇప్పుడు ఎలన్ మస్క్ సంపద లక్ష కోట్లకు చేరుకున్నది. దీంతో ఆయన ప్రపంచంలోని తొట్ట తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు. తాజాగా స్పేస్ఎక్స్ ఐపీవో సేల్‌తో ఆయన సంపద రాకెట్లా దూసుకెళ్లింది. మస్క్ సంపద సుమారు 1.77 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్: స్పేస్ఎక్స్ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఇప్పుడు ట్రిలియనీర్ అయ్యారు. ఆయన సంపద ఇప్పుడు లక్ష కోట్లు దాటేసింది. తాజాగా ఆ కంపెనీ ఐపీవో సేల్స్ జరిగాయి. హాట్‌కేకుల్లా ఆ కంపెనీ షేర్లు అమ్ముడుపోయాయి. అనూహ్య రీతిలో ఆయన సంపద పెరిగిపోయింది. హేమీహేమీ టైకూన్లను దాటివేస్తూ.. ఔత్సాహిక వ్యాపారి దశ నుంచి ట్రిలియనీర్‌గా ఆయన ఎదిగారు. రాకెట్లు, శాటిలైట్లు, ఏఐ కంపెనీలు, టెస్లా కార్లు.. మస్క్ వ్యాపారంలో ఉన్నాయి. అయితే తాజా ఐపీవో ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ 75 బిలియన్ల డాలర్లు ఆర్జించింది.
ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లో పెట్టుబడిదారులు ఉత్సాహంతో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఐపీవో సేల్‌లో ఒక్కొక్క షేర్‌ను 135 డాలర్లకు అమ్మేశారు. దీంతో మస్క్ రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీ విలువ అమాతం పెరిగింది. మొత్తం 555.56 మిలియన్ల షేర్లను అమ్మేశారు. దాంతో ఆ కంపెనీకి ఐపీవో ద్వారా సుమారు 75 బిలియన్ల డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్పేస్, శాటిలైట్, ఏఐ కంపెనీల మొత్తం విలువు సుమారు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది.
మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ తొలిసారి శుక్రవారం వాల్‌స్ట్రీట్ ట్రేడింగ్‌లోకి వెళ్లింది. నాస్డాక్లో ట్రేడింగ్ కోసం షేర్లను అమ్మిన అమెరికా కంపెనీల్లో స్పేస్ఎక్స్ ఏడో స్థానంలో ఉన్నది. ఫోర్బ్స్, ఆల్ఫాబెట్ కంపెనీలు కూడా గతంలో షేర్లను సేల్ చేశాయి. రెండో సంపన్న వ్యక్తి కేవలం 300 బిలియన్ల డాలర్ల దగ్గరే ఉన్నారని, అంటే మస్క్ దగ్గర ఉన్న దాంట్లో మూడో వంతు అని ఫోర్బ్స్ వెల్త్ ఎడిటర్ మాట్ డ్యూరట్ తెలిపారు. ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్ సంపద సుమారు 400 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- ipo
- SpaceX
- Trillionaire
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

