Aeroplane Fire Accident | దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. దక్షిణ కొరియాలోని ఒక విమానాశ్రయంలో మంగళవారం నిలిపి ఉంచిన విమానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ప్రమాద సమయంలో విమానంలో లోపల ఉన్న 176 మంది ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రమాదం వల్ల ముగ్గురు గాయ పడ్డారని నేషనల్ ఫైర్ ఏజెన్సీ ప్రకటించింది. 176 మందిలో 169 మంది ప్రయాణికులు, ఏడుగురు క్రూ సిబ్బంది ఉంటారు.
బుషన్ గింహా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి హాంకాంగ్ బయలుదేరి వెళ్లాల్సిన ఎయిర్‌బస్ విమానం ఏ321 విమానంలో ఈ ప్రమాదం జరిగింది. కొద్ది సేపట్లో విమానం బయలుదేరాల్సి ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది. విమానానికి మంటలు అంటుకున్నా అందులో ఉన్న ప్రయాణికులు, క్రూ సిబ్బందిని సురక్షితంగా తరలించామని అధికారులు తెలిపారు.
విమానంలో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. గత నెల 29న థాయిలాండ్ నుంచి మువాన్ వెళ్లాల్సిన బోయింగ్ 737-800 జెజూ విమానం కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 181 మంది ప్రయాణికులు, క్రూ సిబ్బందిలో 179 మంది మృత్యువాత పడ్డారు.
Fire breaks out on an Air Busan A321 bound for Hong Kong at Gimhae International Airport in Busan, South Korea.
At around 10:30 p.m. on Tuesday, a fire broke out in the tail section of the aircraft.
All 170 passengers and crew evacuated, and there were no casualties,… pic.twitter.com/GqzIkrUx85
— Breaking Aviation News & Videos (@aviationbrk) January 28, 2025