మోదీనగర్: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సత్తాచాటింది. మహిళల 48కిలోల విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి..తన పేరిటే ఉన్న మూడు జాతీయ రికార్డులను తిరుగరాసింది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన మీరా తాజాగా జాతీయస్థాయిలోనూ తనకు తిరుగులేదని చాటిచెప్పింది.
తాను పోటీకి దిగిన 48కిలోల కేటగిరీలో స్నాచ్‌లో 89కిలోలు ఎత్తిన క్లీన్ అండ్ జర్క్‌లో 116కిలోలతో మొత్తంగా 205కిలోలతో కొత్త జాతీయ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని మీరా పేర్కొంది.