టోక్యో, ఫిబ్రవరి 4: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భీకర మంచు ఉత్తర జపాన్ను వణికిస్తున్నది. బుధవారం నాటికి జపాన్లోని 15 ప్రిఫెక్చర్లు (పరిపాలనా విభాగాలు) ప్రభావితమైనట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇండ్ల వద్ద మంచును తొలగించే క్రమంలో ప్రమాదానికి గురై చాలామంది మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేక, విద్యుత్తు సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బుల్లెట్ రైళ్లు సహా చాలా రైలు మార్గాలు నడవటం లేదని ప్రభుత్వం తెలిపింది.