DeepSeek | కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో చైనాకు చెందిన డీప్‌సీక్ (DeepSeek) పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినీ, మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన అజురా, కోపైలట్‌ను తోసిరాజని ‘డీప్‌సీక్’ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ‘డీప్‌సీక్’ని ఉద్దేశిస్తూ.. అమెరికన్ టెక్ కంపెనీలకు ఇదో మేల్కొలుపు అంటూ వ్యాఖ్యానించారంటే ఇది ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తున్నదో అర్థంచేసుకోవచ్చు.
అయితే, తక్కువ ఖర్చుతో చాట్ జీపీటీతో సమానమైన ఫీచర్స్‌ను అందిస్తూ మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిన డీప్‌సీక్ యాప్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ యాప్ భద్రతా ప్రమాణాలను పాటించదని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్ సేవలపై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి.
ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ దేశాలు చైనా డీప్‌సీక్ వాడకంపై నిషేధం విధించాయి. భారత ప్రభుత్వం సైతం ఆఫీస్ కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి కృత్రిమ మేధ(ఏఐ) యాప్‌లను వాడరాదని, డౌన్లోడ్ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియా (South Korea) సైతం ఈ డీప్‌సీక్‌పై వేటు వేసింది. ఆ దేశ రక్షణ, వాణిజ్య కంప్యూటర్లలో డీప్‌సీక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీని వినియోగంపై పలు దేశాల నుంచి వస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read..
“DeepSeek | ఏఐలో సంచలనం డీప్‌సీక్.. దీన్ని చూసి గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎందుకంత భయపడుతున్నాయి!”
“DeepSeek | ఆఫీసులో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు”
Argentina | ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్జెంటీనా ఔట్