DeepSeek | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఆఫీస్ కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి కృత్రిమ మేధ(ఏఐ) యాప్‌లను వాడరాదని, డౌన్లోడ్ చేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పత్రాలు, డాటా గోప్యత గల్లంతయ్యే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది.
ఈ మేరకు జనవరి 29న కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులందరికీ ఒక నోట్ జారీచేసినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆఫీసు పరికరాల్లో ఏఐ టూల్స్ లేదా ఏఐ యాప్స్ వాడరాదని ఆ నోట్లో కేంద్రం స్పష్టం చేసింది.