దుబాయ్, జూన్ 18: పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన దేశాల జాబితాలో యూఏఈ కూడా చేరింది. 15 ఏండ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వాడకంపై నిషేధం విధించింది. దీంతో 15 ఏండ్లలోపు పిల్లలు ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఓపెన్ చేయడానికి అనుమతి ఉండదు.
ఎలాంటి కంటెంట్ పోస్టు చేయడానికైనా, కామెంట్, లైక్ చేయడానికి వీలుండదు. 15 ఏండ్ల తర్వాత పిల్లలకు కూడా కంటెంట్, స్క్రీన్ టైమింగ్ లాంటి వాటిపై ఆంక్షలు ఉంటాయి. ఈ మేరకు సోషల్ మీడియా యాప్స్, ఏఐ లాంటివి ఈ రూల్స్ మేరకు పనిచేయడానికి యూఏఈ 12 నెలల టైమ్ ఇచ్చింది. ఇలా నిబంధనలు విధించిన మొదటి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది.