మునుపెన్నడూ లేనంత స్థాయిలో రష్యా పట్టణం ‘కామ్చాట్సీ’ని మంచు కమ్మేసింది. జనవరిలో ఇప్పటివరకు 2 మీటర్లకుపైగా హిమపాతం కురువడంతో భవనాలు, అపార్ట్మెంట్స్, రోడ్లు పూర్తిగా మంచు తుఫాన్లో కూరుకుపోయాయి. గత 60 సంవత్సరాల్లో ఇది అత్యంత తీవ్రమైన హిమపాతంగా వాతావరణ పర్యవేక్షణ కేంద్రాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధికారులు ఇక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నగరం అంతటా అనేక మీటర్ల ఎత్తులో మంచు పేరుకుపోయింది. రోడ్లపై కార్లు, ఇతర వాహనాల్ని మంచు పూర్తిగా కప్పేసింది. ఇద్దరు పౌరులు హిమపాతంలో చిక్కుకొని చనిపోయారు.