China Tower: 109 అంతస్తుల టవర్‌ను ఢీకొన్న విమానం.. వివరణ ఇవ్వని చైనా
CITIC Tower: బీజింగ్‌లోని 109 అంతస్తుల భవనాన్ని ఓ చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు పూర్తి అయ్యింది. కానీ చైనా సర్కారు మాత్రం ఆ ఘటన గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌ను స్థానిక ప్రభుత్వం నిషేధించింది.
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న 109 అంతస్తుల భవనాన్ని(China Tower) ఓ చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు పూర్తి అయ్యింది. కానీ చైనా సర్కారు మాత్రం ఆ ఘటన గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌ను స్థానిక ప్రభుత్వం నిషేధించింది. చాలా కట్టుదిట్టమైన ఎయిర్‌స్పేస్ ఆంక్షలు ఉండే బీజింగ్‌లో ..ఓ భారీ బిల్డింగ్‌ను విమానం ఎలా ఢీకొంటిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే సీఐటీఐసీ టవర్‌కు సమీపంలోనే కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్నది. ఆ బిల్డింగ్‌ను విమానం ఢీకొన్న తర్వాత .. విమాన శిథిలాలు కింద పడ్డ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన తర్వాత లైట్ కంబాట్ విమానాలపై బీజింగ్‌లో నిషేధం విధించారు. సీఐటీఐసీ టవర్ ఎత్తు సుమారు 1700 అడుగులు ఉంటుంది. సన్వార్డ్ ఎస్ఏ60 ఎల్ అరోరైట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆ బిల్డింగ్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. అయితే టార్గెట్ చేసి మరీ ఆ టవర్‌ను పేల్చే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ విమానం టూ-సీట్.. సింగిల్ ఇంజిన్. చైనా కంపెనీ సన్వార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేసింది. టూరింగ్, ఏరియల్ ఫోటోగ్రఫీ, రిక్రియేషనల్ ఏవియేషన్ కోసం దీన్ని డిజైన్ చేశారు. సెప్టెంబర్ లెవన్ తరహా దాడి జరిగిందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే చైనా సర్కారు తాజా ఘటన పట్ల వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
🇨🇳 A plane crashed into Beijing’s tallest skyscraper
Debris fell near the eastern entrance of the China Zun Tower.
The China Zun skyscraper is in the top 10 tallest buildings in the world. The height of the tower is 528 meters. pic.twitter.com/Tt8hmDkc3V
— Visegrád 24 (@visegrad24) June 26, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

