Turbulence | యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా కుదుపులకు (Turbulence) లోనైంది. ఈ ఘటనలో సిబ్బంది సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. దీంతో విమానాన్ని లాగోస్ (Lagos)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఫ్లైట్రాడార్ ప్రకారం.. 245 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు పైలట్లతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం నైజీరియాలోని లాగోస్ నుంచి వర్జీనియా (Virginia)లోని వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Washington Dulles International Airport) బయల్దేరింది. టేకాఫ్ అయిన 93 నిమిషాల తర్వాత విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా తమ సీట్లలో నుంచి ఎగిరి పడ్డారు. ఫ్లైట్‌లోని ఫుడ్, ఇతర వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఘటనతో విమానాన్ని లాగోస్‌కు దారి మళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం గాయపడిన ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు గల కారణాలపై యూఎస్, నైజీరియా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Chenab Bridge | చీనాబ్ రైలు వంతెనపై పరుగులు పెట్టిన వందేభారత్.. VIDEO
Mumbai Attack | ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు అమెరికా సుప్రీం ఓకే
Kush Desai: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్టును నియమించిన ట్రంప్