తన భార్యతో రసవత్తరంగా శృంగారం చేసిన ఆ వ్యక్తి.. కాసేపటికే గజినీలా మారిపోయి గతం మర్చిపోయాడు. అందుకని చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు.
అది తన పెళ్లి రోజు కావడంతో.. సెలబ్రేట్ చేసుకోలేదని చాలా బాధ పడిపోయాడు. భార్యకు ఏడుస్తూ క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘లేదు.. లేదు మనం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం’’ అని ఆమె ఎంత చెప్పినా నమ్మలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటూ భార్యాపిల్లలను పదే పదే అడుగుతూ విసిగించాడు.ఈ ఘటన ఐర్లాండ్‌లోని లైమ్‌రిక్ ప్రాంతంలో వెలుగు చూసింది.
దీని గురించి ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 66 ఏళ్ల ఒక ఐర్లాండ్ పౌరుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ వెంటనే జీవితంలో కొన్ని సంఘటనలు మర్చిపోయాడు. మొబైల్లో ఆ రోజు డేట్ చూసి షాకయ్యాడు. రెండ్రోజుల క్రితం మ్యారేజ్ యానివర్సరీ మర్చిపోయానని, తన భార్యతో సంతోషంగా గడపలేదని బాధపడిపోయాడు.
అయితే అతను మ్యారేజ్ యానివర్సరీని తన కుటుంబ సభ్యులు మిత్రుల మధ్య సంతోషంగా జరుపుకున్నాడు. ఇదే విషయం భార్యాపిల్లలు చెప్పడంతో ఆశ్చర్యపోయిన సదరు వృద్ధుడు.. ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకున్నాడు. అతనికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు తేల్చారు. దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. అతని సమస్యను టీజీఏ (ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా) అని చెప్పారు.
కొన్నిసార్లు శారీరకంగా తీవ్రమైన శ్రమ చేసినప్పుడు గతంలో జరిగిన ఘటనలను మర్చిపోతారని, దీని వల్ల పెద్దగా సమస్యలు ఉండవని చెప్పారు. అయితే బాధితులు, వాళ్ల కుటుంబ సభ్యులు డిప్రెషన్‌కు గురవుతారని తెలిపారు.
టీజీఏతో బాధపడే వారికి సడెన్‌గా మెమొరీలో కొంత భాగం మాయమైపోతుందని, కొన్ని గంటల తర్వాత మళ్లీ అవి గుర్తుకొచ్చే అవకాశం ఉందని వివరించారు. సదరు ఐర్లాండ్ పౌరుడికి కూడా భార్యాపిల్లలతో మాట్లాడిన తర్వాత కొన్ని గంటలకు అన్నీ గుర్తొచ్చాయని తెలుస్తోంది.