ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ వ్యయ నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధించాలని ఆలోచిస్తున్నది. ప్రధాని నియమించిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ చేసిన ప్రతిపాదనల్లో ఇదొకటి.
ప్రభుత్వ శాఖలు/విభాగాల ఖర్చును 15 శాతం తగ్గించాలని, సమాఖ్య మంత్రులు, రాష్ట్ర మంత్రు లు, సలహాదారుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని, మిగిలినవారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది.