Fatty Liver | ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా..? అయితే ఈ ఆహారాలను తీసుకోండి..!
మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం నుండి విషాన్ని తొలగించడంలో, హానికరమైన పదార్థాలను విచ్చినం చేయడంలో, అనారోగ్య సమస్యలకు వాడే మందుల నుండి వచ్చే విషాలను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా కాలేయం తన విధులను నిర్వర్తిస్తుంది.
Fatty Liver | మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం నుండి విషాన్ని తొలగించడంలో, హానికరమైన పదార్థాలను విచ్చినం చేయడంలో, అనారోగ్య సమస్యలకు వాడే మందుల నుండి వచ్చే విషాలను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా కాలేయం తన విధులను నిర్వర్తిస్తుంది. అలాగే పిత్తాన్ని విడుదల చేసి జీర్ణక్రియలో కూడా కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వులను విచ్చినం చేయడంలో, శరీరం పోషకాలను గ్రహించేలా చేయడంలో ఈ పిత్త రసం పాత్ర ఎంతో ఉంది. కానీ మారిన మన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది కాలేయ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కనుక కాలేయ ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించడం చాలా అవసరం.
గుమ్మడి గింజలు..
జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు సరైన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మెగ్నీషియం ఉండే ఆహారాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని వారు చెబుతున్నారు. గుమ్మడి గింజలను అవకాడాతో కలిపి తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవకాడో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు కాలేయ పనితీరుకు కూడా మద్దతును ఇస్తుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు కాలేయం డిటాక్సిఫికేషన్ ను మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఇక గుమ్మడి గింజలల్లో ఉండే మెగ్నీషియం, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు కాలేయం వాపును తగ్గించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
పాలకూర, ఆలివ్ ఆయిల్..
అదే విధంగా పాలకూర, ఆలివ్ ఆయిల్ ను కలిపి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పాలకూరలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. ఇది కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకూరలో ఉండే నైట్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఎంజైమ్ ల స్థాయిలను మెరుగుపరుస్తాయి. అలాగే ఆలివ్ ఆయిల్ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కాలేయ వాపు తగ్గుతుంది. ఇక పొట్టు మినపప్పు కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ తో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మినపప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫినాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కాలేయ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
డార్క్ చాక్లెట్..
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో డార్క్ చాక్లెట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. దీనిలో ఎపికాటెచిన్, కాటెచిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కాలేయ వాపును తగ్గిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. సోయాబీన్స్ కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. సోయాలో జెనిస్టీన్, డైడ్జిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. అలాగే బాదం, జీడిపప్పులో కూడా మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఫ్యాటీలివర్ సమస్య వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కాలేయ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ తో పాటు ఇతర కాలేయ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆహారాల్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీర మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Fatty liver
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

