న్యూఢిల్లీ : బంగ్లాదేశ్లో 2026లో జరిగే జాతీయ ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీని కనుక పోటీ చేయడానికి అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుదారులందరూ ఎన్నికలను బహిష్కరిస్తారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టంచేశారు. గత ఏడాది అంతర్యుద్ధం కారణంగా ఏర్పడిన తిరుగుబాటుతో పదవీచ్యుతురాలై భారత్ వచ్చి ఆశ్రయం పొందుతున్న హసీనా వివిధ అంశాలపై బుధవారం తన అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత రాజధానిలో తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ రాజకీయాల్లో అధికారం చేపట్టడానికి అయినా, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అయినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.