హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో అమెరికాకు(America) ఇరాన్ నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ(Shahram Irani) సరి కొత్త హెచ్చరిక జారీ చేశారు. శత్రువు వెన్నులో వణుకుపుట్టించే ఒక ఆయుధాన్ని టెహ్రాన్ త్వరలో మోహరిస్తుందని, వారికి(అమెరికా) గుండెపోటు రాదని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఆయన ఆ ఆయుధం వివరాలను వెల్లడించనప్పటికీ, అది యుద్ధభూమిలో పరిస్థితిని ఏకపక్షంగా మార్చివేస్తుందని పేర్కొన్నారు.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అనేక ప్రతీకార చర్యలు చేపట్టిందని, వాటిలో అమెరికా విమానవాహక నౌక అబ్రహం లింకన్ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పలు క్షిపణి దాడులు కూడా ఉన్నాయని హ్రామ్ ఇరానీ తెలిపారు. ఈ దాడులు అమెరికా వైమానిక కార్యకలాపాలకు తాత్కాలికంగా అంతరాయం కలిగించాయని వివరించారు.
పశ్చిమాసియా అంతటా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ బలగాలు 100కు పైగా విడత దాడులు చేసినట్లు గుర్తు చేశారు. మా కొత్త ఆయుధం అమెరికా గెండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయమన్నారు.