US Shooting | అమెరికాలో మరోసారి కాల్పుల (US Shooting) కలకలం రేగింది. నార్త్ కరోలినా (North Carolina)లో శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు. క్రిస్మస్ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని (Christmas Tree Lighting) నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దాదాపు 200 మందికిపైగా హాజరయ్యారు. రాత్రి 7:30 గంటల సమయంలో అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో అక్కడ 200 నుంచి 300 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా అధ్వానస్థాయిలోనే
Mohan Bhagwat | హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదు : మోహన్ భగవత్
Al Falah University | న్యాక్‌కు అల్ ఫలాహ్ వర్సిటీ క్షమాపణలు