శనివారం 23 జనవరి 2021
International - Dec 05, 2020 , 11:25:24

సీరం అధినేత‌కు 'ఏషియ‌న్స్ ఆఫ్ ఇయ‌ర్' అవార్డు

సీరం అధినేత‌కు 'ఏషియ‌న్స్ ఆఫ్ ఇయ‌ర్' అవార్డు

హైద‌రాబాద్‌: ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స్థాయిలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆధార్ పూనావాలాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది.  ఏషియ‌న్స్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డుకు ఎంపికైన ఆరుగురిలో ఆధార్ పూనావాలా ఉన్నారు.  సింగ‌పూర్‌కు చెందిన డైలీ ప‌త్రిక ద స్ట్రెయిట్స్‌ టైమ్స్ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.  కోవిడ్‌19 పోరాటంలో ప‌నిచేసిన వారికి ఈ గుర్తింపు ఇచ్చారు.  ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కాల‌తో క‌లిసి సంయుక్తంగా సీరం సంస్త‌.. కోవీషీల్డ్ టీకాను అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే. ద స్ట్రెయిట్స్‌ టైమ్స్ ప్ర‌క‌టించిన జాబితాలో.. చైనా ప‌రిశోధ‌కుడు జాంగ్ యాంగ్‌జెన్‌, చైనాకు చెందిన మేజ‌ర్ జ‌న‌ర‌ల్ చెన్ వీయి, జ‌పాప్‌కు చెందిన డాక్ట‌ర్ రుచి మోరిషిట‌, సింగ‌పూర్ ప్రొఫెస‌ర్ ఓయి ఇంగ్ ఇయాంగ్‌లు ఉన్నారు. Sars-CoV-2 వైర‌స్ తీవ్ర మార‌ణ‌హోమాన్ని సృష్టించింద‌ని, దాని వ‌ల్ల ప్రజా వ్య‌వ‌స్థ స్తంభించింద‌ని,  అయితే పూనావాలాతో పాటు మిగితా అయిదుగురు వైర‌స్ బ‌స్ట‌ర్లుగా నిలిచార‌ని ప్ర‌శంసాప‌త్రంలో తెలిపారు. మీ ధైర్యం, సాహ‌సం, దీక్ష‌, సృజ‌నాత్మ‌క‌త‌కు సెల్యూట్ చేస్తున్నామ‌ని, ఇలాంటి భ‌యాన‌క స‌మ‌యంలో మీరు ఆసియా ప్ర‌జ‌ల‌కు ఆశా దీపిక‌ల్లా నిలిచార‌ని ప్ర‌శంసా ప‌త్రంలో పేర్కొన్నారు.  


logo