మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 02:00:02

శ్రీలంకలో రెండో దశ ఉద్ధృతి!

శ్రీలంకలో రెండో దశ ఉద్ధృతి!

కొలొంబో: శ్రీలంకలో రెండో దశ కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతున్నది. ఆక్టోబర్‌ 4నాటికి ఆ దేశంలో 3,396 కేసులు నమోదయ్యాయి. అయితే రెండోదశలో వైరస్‌ వ్యాప్తి వల్ల శనివా రంనాటికి కేసుల సంఖ్య 10వేలు దాటింది. కాగా రెండో దశ ఉద్ధృతిలో వైరస్‌ ఉత్పరివర్తనాన్ని గుర్తించామని, దీంతో మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.