శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 14:45:46

పాకిస్థాన్‌ను కుదిపేసిన భారీ వర్షాలు.. 300 మందిపైగా మృతి

పాకిస్థాన్‌ను కుదిపేసిన భారీ వర్షాలు.. 300 మందిపైగా మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో గత రెండున్నర నెలలుగా కురిసిన కుండపోత వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. వర్షాల ధాటికి చాలా నగరాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి, ఇండ్లు కూలిపోయాయి. వర్షాలకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 310 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 230 మందికిపైగా గాయపడ్డారు.

రుతుపవనాలు ప్రారంభమైన జూన్ 15 నుంచి నేటి వరకు ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో 116 మంది, సింధ్‌ ప్రావిన్స్‌లో 136 మంది, బలూచిస్తాన్‌లో 21 మంది, పంజాబ్‌లో 16 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 11 మంది, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) లో 12 మంది మృతి చెందినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) తెలిపింది. మృతి చెందిన వారిలో 135 మంది పురుషులు, 70 మంది మహిళలు, 107 మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. 142 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, 141 మంది పిల్లలు గాయపడ్డారని, 78,521 ఇండ్లు కూలిపోయాయని, 1,39,102 ఇండ్లు దెబ్బతిన్నాయని వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo