Earth | కాన్బెర్రా: భూమికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. భూమి లోపల ఉండే బాహ్య కేంద్ర మండలం(ఔటర్ కోర్) లోపల డోనట్ ఆకారంలో ఒక ప్రాంతం దాగి ఉన్నట్టు గుర్తించారు.
భారీ భూకంపాలు సంభవించినప్పుడు రికార్డయ్యే తరంగాల(సెస్మిక్ వేవ్స్)ను అధ్యయనం చేసి గుర్తించిన ఈ అంశాలు సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. సెస్మిక్ తరంగాలు ఔటర్ వేవ్ మీదుగా ప్రయాణించే సమయంలో, భూప్రావారం(మాంటిల్) సరిహద్దు వద్ద నెమ్మదిస్తున్నాయని ప్రొఫెసర్ తాల్సిక్ తెలిపారు. మరింత లోతుగా అధ్యయనం చేయగా బాహ్య కేంద్ర మండలంలో డోనట్ ఆకారంలో ఓ ప్రాంతాన్ని గుర్తించామని చెప్పారు.