కేంబ్రిడ్జ్ : నయా ట్రెండింగ్ చాట్‌జీపీటీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా ఓ విద్యార్థికి ప్రతిష్ఠాత్మక స్కాలర్షిప్ పొందేందుకు చాట్‌జీపీటీ సాయపడింది. కెనడాకు చెందిన ప్రసిద్ధ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్‌లో ఆ విద్యార్థికి స్కాలర్షిప్ వచ్చింది. విక్టోరియా లైబ్రరీస్ యూనివర్సిటీకి చెందిన అడ్వాన్స్డ్ రిసెర్చ్ అధిపతి మ్యాట్ హుకులక్ ఈ మేరకు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి స్కాలర్షిప్ కోసం మ్యాట్ సిఫారసు లేఖను తయారు చేయాలనుకున్నారు. వెంటనే చాట్‌జీపీటీని అడిగేశారు. అది సరికొత్తగా సిఫారసు లేఖ అందించింది. చాట్‌జీపీటీ తయారు చేసిన లేఖ ద్వారా సదరు విద్యార్థికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కాలర్షిప్ లభించింది.