ఇస్లామాబాద్, మే 16: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ నుంచి ఆ దేశ పౌరులు కొందరు విదేశాలకు వెళ్లి యాచక వృత్తి చేస్తున్నారు. అయితే వారిని భరించలేక సౌదీ ఆరేబియా ఒక్కసారిగా 5 వేల మందిని తిరిగి పాక్కు పంపించింది.
పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ శుక్రవారం జాతీయ అసెంబ్లీకి వెల్లడించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడు ఎంఎన్ఏ సెహర్ కమ్రాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.