కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా కదులుతున్న రష్యా సేనలు మరింత చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రష్యా బలగాలు కీవ్ దిశగా అయిదు కిలోమీటర్లు ముందుకు కదిలినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. రష్యా సైన్యం భారీ కాన్వాయ్‌తో కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీవ్ శత్రుదుర్భేధ్యంగా మారింది. రష్యా సేనల్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీతో పాటు నగర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. వాయవ్య దిశ నుంచి కీవ్‌కు వస్తున్న రష్యా దళాలు మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. ఇక ఈశాన్య దిశ నుంచి వస్తున్న రష్యా బలగాలు కీవ్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ప్రాంత నగరం చెర్నిహివ్ ప్రస్తుతం ఒంటరి అయినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రష్యా 775 మిస్సైళ్లను ఫైర్ చేసినట్లు అమెరికా చెప్పింది. ఆ మిస్సైళ్లలో అన్ని రకాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ పౌరులే ఆయుధాలతో కీవ్ నగరాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చినట్లు కీవ్ మేయర్ తెలిపారు.