మాస్కో: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి విదేశీ మెసేజింగ్ యాప్‌లకు పోటీగా సూపర్‌యాప్ మ్యాక్స్(ఎంఏఎక్స్)ను రష్యా అందుబాటులోకి తెచ్చింది. దీనిని ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని రష్యా కోరింది. స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యం అవసరమయ్యే డిజిటల్ సేవలన్నీ మ్యాక్స్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
దీనిని రష్యా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ యాప్ పేరెంట్ కంపెనీ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా జనాభాలో మూడో వంతు మంది (4.5 కోట్ల మంది) మ్యాక్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. రోజుకు సగటున 1.8 కోట్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.