కీవ్: ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్ నగరంపై రష్యా మిస్సైల్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖార్కివ్‌లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్‌పై ఈ దాడి జరిగింది. ఇవాళ ఉదయం ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ వద్ద ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టార్గెట్ చేశారు. మిస్సైల్ దాడితో ఆ ప్రాంతంలో భారీ పేలుడు, మంట చెలరేగింది. సమీపంలో ఉన్న బిల్డింగ్, కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు తర్వాత కార్లు, బిల్డింగ్ శిథిలాలు కనిపించాయి. ఉదయం 8 గంటలకు దాడి జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం లేదు. ఉక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్. ఆ నగరంలో సుమారు 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Massive strike on Kharkiv govt HQ about 30 mins ago. So much for “liberating” this Russian-speaking city. Shock and awe into surrender.
pic.twitter.com/LhpGuzk6zw— Oliver Carroll (@olliecarroll) March 1, 2022