కీవ్, మార్చి 9 : గ్యాస్ పైప్ లైన్లో నడుచుకుని వచ్చిన రష్యా సైనికులు కుర్స్క్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సేనలపై వెనుక నుంచి విరుచుకుపడ్డారు. నిరుడు ఆగస్టులో ఉక్రెయిన్ ఆకమించుకున్న సరిహద్దు ప్రావిన్స్ అయిన కుర్క్స్లో తమ భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. రష్యా సైనికులు 15 కిలోమీటర్లు గ్యాస్ పైపులైన్లో అనేక రోజులు నడుచుకుంటూ వచ్చి సుడ్జా పట్టణ సమీపంలో వెనుక నుంచి ఉక్రెయిన్ దళాలపై దాడులు చేసినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.