మాస్కో: విమానం ఎగురుతుండగా ట్రైనీ మహిళతో పైలట్ శృంగారం జరిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో ఈ సంఘటన వెలుగు చూసింది. 28 ఏండ్ల పైలట్ కొందరు ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నాడు. రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో ఒక మహిళా ట్రైనీకి శిక్షణ ఇస్తూ ఎక్స్ట్రా క్లాసుల పేరుతో ఆమెను లోబరుచుకున్నాడు. విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచి ఆ మహిళతో శృంగారం జరిపాడు. దీనిని మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు.
కాగా, అక్కడ శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. దీంతో శిక్షణ ఇచ్చే పైలట్‌తోపాటు మహిళా ట్రైనీని ఆ ఫ్లైట్ స్కూల్ తొలగించింది. అయితే ఈ వీడియో వైరల్ కాకముందే ఆ మహిళ రిజైన్ చేసినట్లు వార్తలొచ్చాయి. అలాగే ఆ పైలట్ వివాహితుడు కావడంతో శృంగారాన్ని రికార్డు చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎక్స్ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలట్ హామీ ఇవ్వడంతో దానికి ఆమె ఒప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.