ఇది… గణపతి నగరం!
వినాయకుడు హైందవంలో ప్రధాన దేవత. అందుకే ఆయన ఇక్కడ తొలి పూజలందుకుంటాడు. అయితే పొరుగున ఉన్న దేశం థాయ్లాండ్లోనూ గణపతిని విఘ్నవినాశకుడిగా, సంపదలకు అధిదేవతగా కొలుస్తారు. అందుకే అక్కడా ఆయన విగ్రహాలు దర్శనమిస్తాయి. అంతేకాదు, అక్కడి ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద రూపాల్లో గణాధిపతిని రూపొందించుకొని ఆయన మీద వాళ్ల ప్రేమను చాటుకుంటున్నారు. ఆయా విగ్రహాలు వేటికవే విశేషాలు!
వినాయకుడు హైందవంలో ప్రధాన దేవత. అందుకే ఆయన ఇక్కడ తొలి పూజలందుకుంటాడు. అయితే పొరుగున ఉన్న దేశం థాయ్లాండ్లోనూ గణపతిని విఘ్నవినాశకుడిగా, సంపదలకు అధిదేవతగా కొలుస్తారు. అందుకే అక్కడా ఆయన విగ్రహాలు దర్శనమిస్తాయి. అంతేకాదు, అక్కడి ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద రూపాల్లో గణాధిపతిని రూపొందించుకొని ఆయన మీద వాళ్ల ప్రేమను చాటుకుంటున్నారు. ఆయా విగ్రహాలు వేటికవే విశేషాలు!
విరాట్ రూపం…
ఈ నగరంలోని వాట్ ఫ్రోంగ్ అకాట్ గణపతి దగ్గర నిలబడితే.. మనుషులు చిన్న సైజు బొమ్మల్లా కనిపిస్తారు. కూర్చుని ఉన్న భంగిమలోనే 49 (160 అడుగులు) మీటర్ల ఎత్తు, 19 మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఇది. అంటే దాదాపు 16 అంతస్తుల ఎత్తున కనిపించే విరాట్ రూపం అన్నమాట. దూరం నుంచే ఆ పెద్ద ముఖం, కిరీటం పర్యటకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కూర్చుని ఉన్న గణపతి మూర్తుల్లో ఇది అది పెద్దది. ఇంతకీ బ్యాంకాక్ నుంచి సుమారు రెండు గంటల సమయం ప్రయాణిస్తే ఈ ఊరిని చేరుకోవచ్చు. ఈ అరుదైన గణపతుల ఆశీర్వాదం తీసుకోవచ్చు!
సుఖానికి ప్రతీక…
అక్కడ ప్రపంచంలోనే ఎత్తయిన గణపతి నిలుచుని ఉంటాడు. అదీ ఏకంగా 14 అంతస్తుల ఎత్తున. దానికి మరికొద్ది దూరంలోనే మరో వినాయకుడు కూర్చుని దర్శనమిస్తాడు. సుమారు 16 అంతస్తులంత ఎత్తుతో కనిపిస్తాడాయన. ఈ తరహా విగ్రహాల్లో ఇది నేలమీదే అతి పెద్దది. మరో గులాబీ వర్ణపు ఏకదంతుడు సేదతీరిన భంగిమలో చిద్విలాసాన్ని చిందిస్తాడు. ఆ లంబోదరుడిదీ రికార్డే…. ఇంతకీ వీళ్లంతా ఉన్నది థాయ్లాండ్లోని ఛాఛోంగ్సౌ నగరంలోనే. అందుకే దాన్ని ‘సిటీ ఆఫ్ గణేశ’గా పిలుస్తారు.

సాధారణంగా కూర్చుని లేదా నిలుచుని కనిపించే వినాయకుడి విగ్రహాలకు భిన్నంగా వాట్ సమాన్ రట్టనారామ్ గణపతి ఉంటాడు. ఒక పక్కకు వాలినట్టుగా ఉండే ఈయన నిండైన సుఖానికి ప్రతీతి. ఆ భంగిమలోనూ అది 16 మీటర్ల ఎత్తు 22 మీటర్ల పొడవుతో దగ్గరికి వెళ్లిన వారిని అబ్బురపరుస్తుంది. ఈ తరహా గణపతి ప్రతిమల్లో ఇది భూమి మీదే పెద్దది. ఈ విగ్రహానికి ఉండే గులాబీ వర్ణం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక, ఈ వినాయకుడి చుట్టూ ఉండే మరో 32 గణపతి విగ్రహాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి మూషికుడి చెవిలో తమ కోరికల్ని రహస్యంగా చెప్పే ఆచారం ఉంది. ఆయనే గణపతికి వాటిని విన్నవించి, పని అయ్యేలా సాయపడతారని భక్తుల నమ్మకం.
అడుగు ముందుకు..
ఛాఛోంగ్సౌలోని విభిన్నమైన గణేశుల్లో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది, ఇక్కడి క్లోంగ్ క్యూయన్ గణేశ్ ఇంటర్నేషనల్ పార్క్లో… నిలుచున్న భంగిమలో కనిపించే వినాయకుడి విగ్రహం. ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టుగా ఉండే ఈ కాంస్య విగ్రహం ఏకంగా 39 మీటర్ల పొడవు ఉంటుంది.

ప్రపంచంలోనే అతి ఎత్తయిన గణపతి విగ్రహం ఇది. పాదాన్ని ముందుకు వేస్తున్న భంగిమను… దేశం, సమాజం, జీవితం మునుముందుకు సాగాలనే భావాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దారు. అంతేకాదు సంపద, పిల్లాపాపలకు, చక్కని పంటలకు గుర్తుగా ఈ గణేశుడు కనిపిస్తాడు. చేతుల్లో ఆయుధాల స్థానంలో మామిడి పండు, అరటి, పనస, చెరకు గడలను పట్టుకొని ఆయన దర్శనమిస్తాడు. 854 విభిన్న భాగాలతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహం నిర్మాణం 2008లో మొదలై 2012లో పూర్తయింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

