‘ఇడుపు కాయితం’ బాణీలు చాలా ప్రత్యేకం
‘ఇడుపు కాయితం’ చిత్రం నిర్మాణదశ నుంచే వార్తల్లో నిలుస్తున్నది. ఈ తెలంగాణ నేపథ్య చిత్రంలో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తుండగా..వంశీ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘శ్రీలత..’అనే పాటకు మంచి స్పందన లభిస్తున్నది.
‘ఇడుపు కాయితం’ చిత్రం నిర్మాణదశ నుంచే వార్తల్లో నిలుస్తున్నది. ఈ తెలంగాణ నేపథ్య చిత్రంలో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తుండగా..వంశీ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘శ్రీలత..’అనే పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో శనివారం సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, గీత రచయిత అలరాజు విలేకరులతో ముచ్చటించారు. సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ‘ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. తెలంగాణ జానపద శైలిని కలబోసి మెలోడీ ప్రధానంగా ఈ పాటను తీర్చిదిద్దాం. ఈ సినిమాలో ఆరు పాటలతో పాటు కొన్ని బిట్స్ ఉంటాయి.
కథలోని సందర్భాలకు మంచి పాటలు కుదిరాయి. తెలుగు సినిమాలో తెలంగాణ జానపద గీతాలకు ఆదరణ పెరగడం ఆనందంగా ఉంది. ఇది మంచి పరిణామం’ అన్నారు. గీత రచయిత అలరాజు మాట్లాడుతూ ‘నాగకర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నా స్వస్థలం. ఇప్పటివరకు 40 చిత్రాలకు పాటలు రాశాను. నాయకానాయికలు హైదరాబాద్ వచ్చే సందర్భంలో ‘శ్రీలత..’ అనే పాట వస్తుంది. శ్రీలత అలకకు కారణం? ఆమెను బుజ్జగించడానికి శ్రీనివాస్ ఏం చేశాడనే నేపథ్యంలో ఈ పాట రాశాను. పూర్తిగా ఫోక్ైస్టెల్లో కాకుండా అందరికి అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించాను. ‘ఇడుపు కాయితం’ గీతరచయితగా నా బతుకునే మార్చిన కాగితం అనుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

