కీవ్‌పై ఒరెష్నిక్ క్షిపణి దాడి
దాడులు, ప్రతీకార దాడులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
- ఉక్రెయిన్ రాజధానిపై విరుచుకుపడ్డ రష్యా
మాస్కో: దాడులు, ప్రతీకార దాడులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి మొదలైన ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. దీనికంటే ముందు రష్యా ఆక్రమిత తూర్పు ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరపగా, ఒక కళాశాల వసతిగృహంపై డ్రోన్లు పడ్డాయి.
ఈ ఘటనలో కనీసం 18 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే కీవ్‌పై మాస్కో క్షిపణుల దాడి మొదలైంది. అణ్వాయుధ సామర్థ్యం గల హైపర్‌సానిక్ క్షిపణి ‘ఒరెష్నిక్’తో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగిందని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.
‘రష్యా క్షిపణి దాడుల్లో ఒక మార్కెట్ కాలిపోయింది. డజన్ల కొద్దీ నివాస భవనాలు దెబ్బతిన్నాయి. పాఠశాలలు ధ్వంసమయ్యాయి. మధ్య ఉక్రెయిన్‌లోని బిలా సెర్కాపై ‘ఒరెష్నిక్’ క్షిపణిని ప్రయోగించారు’ అని జెలెన్స్కీ అన్నారు. యుద్ధాన్ని విస్తరించకుండా రష్యాపై ప్రపంచం ఒత్తిడి తేవాలన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

