Russia Attack: కీవ్‌పై భీకర దాడి.. భారీ పేలుళ్లు.. ఉక్రెయిన్ విలవిల.. వీడియోలు
Russia Attack: కీవ్ దద్దరిల్లింది. ఆ సిటీలో ఉన్న మిలిటరీ ఉత్పత్తి కేంద్రాలను టార్గెట్ చేశారు. భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. రష్యా సుమారు 68 క్షిపణులు, 351 డ్రోన్లతో అటాక్ చేసినట్లు తెలిసింది. 14 మంది కీవ్ నివాసితులు మృతిచెందారు.
కీవ్: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడింది రష్యా(Russia Attack). కీవ్ నగరంలో సోమవారం ఉదయం బీభత్సం సృష్టించారు. మిస్సైళ్లు, డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది. జెలెన్స్కీ ప్రభుత్వ చర్యకు ప్రతీకారంగా ఆ దాడి చేసినట్లు రష్యా రక్షణ దళం పేర్కొన్నది. సోమవారం తెల్లవారుజామున 1.30 నిమిషాలకు తొలి అటాక్ జరిగింది. ఉదయం 5 గంటల వరకు అనేక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. చాలా శక్తివంతమైన బాంబుల మోత మోగినట్లు తెలుస్తోంది. ఆయుధ డిపో, ఉత్పత్తి కేంద్రం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను టార్గెట్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే ఆయుధాలతో ఉక్రెయిన్ మిలిటరీ పరిశ్రమలు, ఇంధన కేంద్రాలపై దాడి చేసినట్లు రష్యా రక్షణ దళం పేర్కొన్నది. కీవ్ నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. రష్యా సుమారు 68 మిస్సైళ్లు, 351 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. ముఖ్యంగా ఉక్రెయిన్ మిలిటరీ ఉత్పత్తి కేంద్రాలను ఈసారి టార్గెట్ చేశారు. కానీ రెసిడెన్షియల్, సివిలియన్ కేంద్రాల్లోనూ విధ్వంసం జరిగినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.
get the coke head dictator Zelinskie in check.. he is killing more Ukranians than Putin.. https://t.co/7tckEZnvXA
— Rorschach (@walt_j_kovacs) July 6, 2026
ఎక్కడెక్కడ టార్గెట్ చేశారన్న అంశాన్ని రష్యా మిలిటరీ పేర్కొన్నది. కీవ్‌తో పాటు కీవ్ పరిసర ప్రాంతాలు, డెనిప్రోపెట్రోవ్స్కీ, పోల్టావా, చెర్కాసీ, చెర్నిగోవ్ ప్రాంతాలపై అటాక్ జరిగింది. అబ్రిస్ పీటూ అనే కేంద్రంపై కూడా దాడి జరిగింది. ఇక్కడ డ్రోన్లు ఉత్పత్తి జరుగుతోంది. యూఏవీలు, ఆర్మోటెక్ కోసం ఇక్కడ రేడియో ఎక్విప్మెంట్ను కూడా ఉత్పత్తి చేస్తారు. మిస్సైళ్ల వార్‌హెడ్స్ తయారు చేసే కేంద్రాన్ని కూడా రష్యా పేల్చివేసింది. నేవీ డ్రోన్లు తయారు చేసే కుజ్నియా రెబల్స్కామ్ షిప్‌యార్డు, నెప్ట్యూన్ క్షిపణులు తయారు చేసే కేంద్రాన్ని కూడా ధ్వంసం చేశారు.
సోమవారం రష్యా జరిపిన భీకర దాడిని ఉక్రెయిన్ తిప్పికొట్టలేకపోయింది. కీవ్‌పై రష్యా సుమారు 23 క్షిపణులతో అటాక్ చేసింది. కానీ ఒక్క క్షిపణిని కూడా ఉక్రెయిన్ వైమానిక దళం కూల్చలేకపోయింది. అయితే ఆ దేశం వద్ద ఇంటర్సెప్టార్ క్షిపణులు తగ్గినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి జరిగిన దాడిలో కీవ్‌లో సుమారు 14 మంది మరణించారు. కీవ్‌కు ఆయుధాలు అందించే అంశంలో నాటో దేశాలు కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని జెలెన్స్కీ కోరారు. క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా ఉక్రెయిన్ మిలిటరీ ఎదుర్కొన్నదని, కానీ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోలేకపోయినట్లు ఆయన అన్నారు. 68 క్షిపణులు, 351 డ్రోన్లతో జరిగిన దాడిలో.. 49 మంది గాయపడినట్లు కీవ్ మిలిటరీ నేత కిముర్ టాచెన్కో తెలిపారు.
🇺🇦🇷🇺 Several civilians, including children, were reportedly injured and killed in Russia’s overnight attack on Kyiv
Russia launched 68 missiles and 351 attack drones across several regions of Ukraine, supposedly targeting parts of Ukraine’s military manufacturing sector, but… https://t.co/2LK4MzMsJK pic.twitter.com/NgrApXWhIm
— Mario Nawfal (@MarioNawfal) July 6, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

