మాస్కో: రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తే, అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందని పేర్కొన్నది. రష్యాకు చెందిన అంతరిక్ష ఏజెన్సీ రాస్‌కాస్మోస్ అధిపతి ఈ వార్నింగ్ ఇచ్చారు. దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని రష్యా ఈ నేపథ్యంలో డిమాండ్ చేసింది. కఠినమైన ఆంక్షల వల్ల ఐఎస్ఎస్ కూలే ప్రమాదం ఉన్నట్లు రాస్‌కాస్మోస్ తెలిపింది. మరోవైపు కేవలం కీవ్‌కు 25 కిలోమీటర్ల దూరానికి రష్యా బలగాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 60 కిలోమీటర్ల పొడుగైన రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ దిశగా కదులుతున్న విషయం తెలిసిందే.